కూతురి బౌలింగ్ లో గంభీర్ బ్యాటింగ్..

SMTV Desk 2017-11-07 15:49:49  goutham gambhir batting, daughter ajin bowling, team india cricket player , viral vedio

న్యూఢిల్లీ, నవంబర్ 07 : టీమిండియా క్రికెటర్, స్టార్ ఆటగాడు గౌతమ్ గంభీర్ అంతర్జాతీయ మ్యాచ్ లో ఎంతో మంది బౌలర్ ల ను ఎదుర్కొని తన బ్యాటింగ్ తో ముచ్చెమటలు పట్టించారు. అలాంటి గంభీర్ తన కూతురు బౌలింగ్ ని ఆడడంలో చాలా ఒత్తిడికి గురైన వీడియో ను ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఆ వీడియో అంతర్జాలంలో వైరల్ గా మారింది. వివరాల్లోకి వెళ్తే గంభీర్ కూతురు ఆజీన్ చదువుతున్న పాఠశాలలో ఇటీవల ఓ కార్యక్రమం నిర్వహించగా, ప్రత్యేక అతిథిగా గంభీర్ విచ్చేశారు. అందులో భాగంగా స్కూల్ యాజమాన్యం అజీన్ కు బంతి ఇవ్వగా గంభీర్ బ్యాటింగ్ చేశారు. ‘నాకు ఔట్‌ సైడ్‌ ది ఆఫ్‌ స్టంప్‌ వేయాలని నా కూతురు ఆజీన్‌కు తెలుసు. ఆజీన్‌ బౌలింగ్‌ ఆడటానికి ఎంతో ఒత్తిడికి లోనయ్యాను’ అంటూ చేసిన ట్విట్ సోషల్ మీడియాలో ఇప్పుడు హల్ చల్ చేస్తుంది.