రుణాల వృద్ధ్యే ఎస్ బిఐ లక్ష్యం

SMTV Desk 2017-06-10 10:36:14  sbi, sbi chairperson, arundathi buttacharya, loans

ముంబాయి, జూన్ 10 : రుణాల వృద్ధ్యే ప్రధాన లక్ష్యంగా ఎస్ బి ఐ పనిచేస్తున్నదని ఛైర్ పర్సన్ అరుంధతీ భట్టాచార్య వెల్లడించారు. ప్రతి సంవత్సరం ఆ లక్ష్యాన్ని పెంచుకుంటూ వెళుతామని ఆమె ప్రక టించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పది నుండి 12 శాతం రుణాల వృద్ధి సాధించడం లక్ష్యంగా నిర్ధ్యేశించుకున్నట్లు, వచ్చే ఆర్థిక సంవత్సరం లో 14 శాతానికి పెంపోందిచడం లక్ష్యాంగా కృషి చేయనున్నట్లు వెల్లడించారు. రుణాల వృద్ధి ద్వారా ఉపాధి అవకాశాలు పెంపోందించడమే ప్రధాన ధ్యేయమని వివరించారు. రుణాల వితరణ పెరగడం ద్వారా స్వయం ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని వెల్ల డించారు. ఇటీవల ముగిసిన అర్హులైన సంస్థాగత మదుపర్లకు షేర్ల జారీ (క్యూఐపీ), అంతర్గత సమీకరణ, అప్రధాన ఆస్తుల విక్రయం ద్వారా చేసిన నిధుల సమీకరణ వల్ల భవిష్యత్ వృద్ధి అవసరాలను చేరుకోగలమని విశ్వసిస్తున్నట్లు ప్రకటించారు. 2019 లోగా బ్యాంకులు బాసెల్ -3 నిబంధనలను అందుకోవాల్సి ఉందని చెప్పారు. ప్రస్తుతం ఎస్ బీ ఐ లో ప్రభుత్వానికి 57.07 శాతం వాటా ఉందని, ఏప్రిల్ 1 నుండి ఎస్ బీఐ లో ఐదు అనుబంధ బ్యాంకులు, మహిళా బ్యాంక్ వీలినమయింది. ఏడాది చివర్లో ఎస్ బీ ఐ లైఫ్ ఇష్యూ, ఎస్ బీ ఐ లైఫ్ ఇన్సూరెన్స్ లో 8 శాతం వాటాను పబ్లిక్ ఇష్యూ ద్వారా విక్రయించనున్నట్లు ఆమె వివరించారు. అదే విధంగా యూటీఐ అసెట్ మేనేజ్ మెంట్, నేషనల్ స్టాక్ ఎక్చేంజీ ల్లో వాటాలను తగ్గించుకుంటామని ప్రకటించారు. టెలికాం రంగానికి ఇచ్చిన రుణాల రికవరి విషయంలో కూడా ప్రత్యేక సమీక్ష నిర్వహిస్తున్నట్లు వివరించారు.