పాట విని ఏ సినిమా చెప్పేస్తుంది.. గూగుల్ సరికొత్త ఆవిష్కరణ..

SMTV Desk 2017-11-07 15:22:05  google assistant, to find what playing song, lyric songs to find, new delhi

న్యూఢిల్లీ, నవంబర్ 07 : ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరు తమ పని ఒత్తిడిలో కాస్తంత ప్రశాంతత కోసం పాటలు వింటున్నారు. అయితే చాలా మందికి తను వినే పాటలు ఏ సినిమాలోనివో తెలియక పక్కవారిని అడిగిన వారు కూడా తెలియదు అంటారు. ఇక నుండి ఆ సమస్య లేదు.. ఎందుకంటే ప్రముఖ సాఫ్ట్ వేర్ దిగ్గజం గూగుల్ సంస్థ గూగుల్ అసిస్టెంట్ ను అప్‌డేట్ చేసింది. దీని సహాయంతో మీ చుట్టూ పక్కల ఎటువంటి పాట ప్లే అయిన వెంటనే గూగుల్ అసిస్టెంట్ ను ఓపెన్ చేసి " వాట్ ఇజ్ సాంగ్ థిస్" అని లేదా " వాట్ సాంగ్ ఇజ్ ప్లేయింగ్" అని టైపు చేస్తే చాలు పాట వివరాలును,పాటకు సంబంధించిన వీడియో లింక్ లు మొత్తం చూపిస్తుంది. అయితే ప్రస్తుతం కొన్ని ప్రముఖ పాటలను మాత్రమే గూగుల్ అసిస్టెంట్ గుర్తుపడుతుంది.