కేంద్రంపై సుప్రీం ధర్మాసనం ఆగ్రహం..

SMTV Desk 2017-11-07 14:58:41  polavaram project, subprime court verdict, Section 90

న్యూఢిల్లీ, నవంబర్ 07 : పోలవరంపై సుప్రీం కోర్టులో విచారణ చేపట్టారు. ఈ ప్రాజెక్ట్ నిర్మాణాలపై అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ ఒడిశా ప్రభుత్వం దాఖలు చేసిన కేసులో తమకు కూడా అవకాశం కల్పించాలని తెలంగాణ, చత్తీష్ ఘడ్ ఇంప్లీడ్ పిటీషన్ దాఖలు చేశాయి. విభజన చట్టంలోని సెక్షన్ 90 ప్రకారం తెలంగాణకు ఈ ప్రాజెక్టుతో ఎలాంటి సంబంధం లేదని రాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లేవనెత్తిన అభ్యంతరాలను జస్టీస్ మదన్ బి.లోకూర్, జస్టీస్ దీపక్‌ మిశ్రా ధర్మాసనం నమోదు చేసింది. కేసు విచారణ సందర్భంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తమకున్న అభ్యంతరాలన్నీ కోర్టుకు తెలిపే స్వేచ్ఛను ధర్మాసనం కల్పించింది. తెలంగాణ, చత్తీష్ ఘడ్ దాఖలు చేసిన ఇంప్లీడ్‌ పిటిషన్లను విచారణకు స్వీకరించింది. ఈ కేసులో ఇప్పటి వరకు ఎందుకు సమాధానం చెప్పలేదని కేంద్రంపై సుప్రీం ఆగ్రహం వ్యక్తం చేస్తూ 25 వేల జరిమానా విధించింది. జరిమానాను ఉపసంహరించాలని కేంద్రం కోరగా ఆ విజ్ఞప్తిని ధర్మాసనం తోసిపుచ్చింది. రెండు వారాల్లోగా సమాధానం కోర్టుకు అందించాల్సిందిగా ఆదేశించి విచారణను రెండు వారాలు వాయిదా వేసింది.