స్టార్క్‌తో ఇంగ్లాండ్ కి ప్రమాదమే : నెహ్రా

SMTV Desk 2017-11-07 14:48:38  aashis nehra comments on aashis series, starc is very danger, england vs australia, new delhi

న్యూఢిల్లీ, నవంబర్ 07 : భారత్ మాజీ క్రికెటర్ ఆశిష్ నెహ్రా యాషెస్‌ సిరీస్‌ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గత 2013-14 సంవత్సరంలో ఆసీస్ పేసర్ మిచెల్ జాన్సన్ సహా, మిగతా పేసర్ లు కూడా చెలరేగడంతో బ్రిటిష్ సొంతగడ్డ పై కంగారూలు ఘన విజయం సాధించారు. ఈ విషయం పై నెహ్రా మాట్లాడుతూ "ఇప్పుడు ఆస్ట్రేలియా సొంత గడ్డ పై యాషెస్‌ సిరీస్‌ జరగడం వారికీ బలమని తెలిపారు. అంతే కాకుండా స్టార్క్‌ చెలరేగితే ప్రత్యర్ధి కి కష్టాలు తప్పవని, బ్యాటింగ్ పరంగా ఇంగ్లాండ్ జాగ్రత్తగా ఆడాలని అభిప్రాయపడ్డారు. గాయాలతో సతమవుతున్న స్టార్క్‌ తిరిగి జట్టులోకి రావడం ఆసీస్ బలమని, ఇంగ్లాండ్ జట్టు లో టాప్ ఆటగాడు బెన్ స్టోక్స్‌ దూరం కావడం పెద్ద ఎదురుదెబ్బని" వ్యాఖ్యానించారు