సంచలనం రేపుతున్న ప్యారడైజ్ పత్రాలు

SMTV Desk 2017-11-07 13:25:48  Paradise documents, Delhi, central government, Investigation

న్యూఢిల్లీ, నవంబర్ 07 : విదేశాల్లో అక్రమంగా పెట్టుబడులు పెట్టిన ప్రముఖుల గుట్టును ప్యారడైజ్ పత్రాలు బయటపెట్టాయి. భారతదేశం సహా ప్రపంచంలోని అనేక మంచి ప్రముఖులు, విదేశాల్లోని కంపెనీలు, సంస్థల్లో పెట్టిన పెట్టుబడులు జరిపిన లావాదేవీల వివరాలు వెలుగులోకి వచ్చాయి. పలు దేశాల అధినేతలు, రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు, సుసంపన్న వ్యక్తులు, బహుళజాతి కంపెనీలు ట్రస్ట్ లు, డొల్ల కంపెనీలు పన్ను కట్టకుండా విదేశాల్లో పెట్టుబడులుగా పెట్టాయి. వాటిలో కొన్ని లావాదేవీలు చట్టవిరుద్ధంగా ఉన్నట్లు పరిశోధన పాత్రికేయుల అంతర్జాతీయ సమైఖ్య ఐసీఐజే ప్రకటించడం తీవ్ర సంచలనం రేపుతుంది. 150 దేశాలకు చెందిన ప్రముఖుల రహస్యాల లావాదేవిలా వివరాలతో కూడిన ప్యారడైజ్ పత్రాలని ఐసీఐజే విడుదల చేసింది. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు పుతిన్ సహా మరికొందరు ప్రముఖులకు సంబంధించిన కీలక వివరాలతో కూడిన ప్యారడైజ్ పత్రాల్లో 714 మంది భారతీయుల పేర్లు ఉన్నాయి. మన దేశానికి చెందిన కొన్ని కార్పొరేట్ సంస్థలు పన్ను ఎగొట్టి రూ. కోట్లు విదేశాలకు తరలించినట్లు తేలింది. ప్యారడైజ్ పత్రాల్లో పౌర విమానయాన శాఖమంత్రి జయంత్ సిన్హా, చతీస్ ఘడ్ ముఖ్యమంత్రి రామన్ సింగ్ కుమారుడు అభిషేక్ సింగ్, కాంగ్రెస్ యువ నేత సచిన్ ఫైలేట్, కేంద్ర ఆర్థిక శాఖమంత్రి కుమారుడు కార్తీ, బిగ్ బీ అమితాబ్ తదితరుల పేర్లు ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో కేంద్రం దర్యాప్తునకు ఆదేశం తెలిపింది.