ధోని పై వ్యాఖ్యలు అనుచితమైనవి : గవాస్కర్

SMTV Desk 2017-11-07 11:50:38  gavaskar comments on dhoni, former crickter lakshman, agarkar, dhoni, about retirement

న్యూఢిల్లీ, నవంబర్ 07 : న్యూజిలాండ్ తో జరిగిన రెండి టీ- 20 లో ధోని 49 పరుగులు చేసి మంచి ఇన్నింగ్స్ ఆడిన జట్టుని గెలిపించాలేకపోయాడు. ఈ విషయం పై మాజీ ఆటగాళ్ళు వీవీఎస్ లక్ష్మణ్, అజిత్‌ అగార్కర్‌ వ్యాఖ్యలపై క్రికెట్ దిగ్గజం గవాస్కర్ స్పందిస్తూ " లక్ష్మణ్, అగార్కర్ ధోనిని తప్పుకోవాలని సూచించారు. అయితే అది వారి వ్యక్తిగత అభిప్రాయం. గత రెండు టీ- 20 ల్లో అల్ రౌండర్ పాండ్యా కేవలం ఒక పరుగు మాత్రమే చేశాడు. కానీ అతని పై ఎవరు మాట్లాడట్లేదు. అసలు ధోనిని ఎందుకు లక్ష్యం చేసుకొని మాట్లాడుతున్నారో నాకు అర్ధం కావడం లేదు." అంటూ వ్యాఖ్యానించారు.