హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ఖాతాదారులకు శుభవార్త

SMTV Desk 2017-11-06 19:20:09  HDFC BANK NEFT, RTGS, EXTRA CHARGES CANCEL, CHECK BOOK, FOR CASH LESS TRANSCATION, MUMBAI

ముంబై, నవంబర్ 06 : ప్రముఖ కార్పొరేట్ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ తమ ఖాతాదారుల సౌలభ్యం కోసం సంచలన నిర్ణయం తీసుకుంది. నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించే దిశగా ఉచిత ఆన్‌లైన్‌ సేవలను వినయోగదారులకు అందించనుంది. తమ కస్టమర్లు ఇంటర్నెట్, మొబైల్ బ్యాంకింగ్ ద్వారా జరిపే నెఫ్ట్, ఆర్‌టీజీఎస్ లావాదేవీలకు ఛార్జీలను రద్దు చేసింది. అంతే కాకుండా చెక్‌ బుక్‌ జారీ, లావాదేవీల ఛార్జీలను కూడా సవరించింది. చెక్ ఆధారిత లావాదేవీలు, రికవరీ ఛార్జీలను, డిసెంబర్ 1, 2017 లో అమలు చేస్తామని తెలిపింది.