ధోనిని ఏ స్థానంలో ఆడించాలి : మేనేజ్‌మెంట్‌

SMTV Desk 2017-11-06 18:51:36  india kiwis 3 rd t-20, dhoni batting order issue, india team management, tiruvananthapuram

తిరువనంతపురం, నవంబర్ 06 : ఇండియా- న్యూజిలాండ్ మధ్య రేపు జరగనున్న నిర్ణయాత్మక T-20 మ్యాచ్ చాలా కీలకం కానుంది. అయితే టీం మేనేజ్‌మెంట్‌ కు ఇప్పుడు కొత్త సమస్య వేటాడుతుంది. అదే ధోని బ్యాటింగ్ ఆర్డర్.. తోలి T-20 లో అయిదవ స్థానంలో, రెండో T-20లో ఆరో స్థానంలో బ్యాటింగ్ కు దిగిన ధోని, మూడో స్థానం నుండి ఏడవ స్థానం వరకు ఎక్కడైనా బ్యాటింగ్ చేయగల సత్తా కలవాడు. అయితే గత మ్యాచ్ లో ధోని(49) పరుగులు చేసినా అటువంటి ఆట తీరు, వేగం T-20కి చాలదు. ప్రస్తుతం భారత్ గత జట్టునే కొనసాగించవచ్చు. బ్యాట్స్ మన్ ను అదనంగా కావాలనుకుంటే మనీష్ పాండే, దినేశ్ కార్తీక్ ల్లో ఒకరికి తుది జట్టులో చోటు దక్కవచ్చు . అలా అయితే ధోని నాలుగవ స్థానంలో వచ్చే అవకాశాలున్నాయి.