భారత్-కివీస్ మ్యాచ్ కు వర్ష సూచనలు..

SMTV Desk 2017-11-06 18:13:47  tiruvanthapuram, india-kiwis 3 rd t-20 match, rain interruption , kerala cricket commiittee

తిరువనంతపురం, నవంబర్ 06 : తిరువనంతపురంలో రేపు భారత్- కివీస్ మధ్య జరగనున్న మూడో T-20కి వర్ష అంతరాయం కలిగించే సూచనలు కన్పిస్తున్నాయి. ఇప్పటికే సిరీస్ ను 1-1 తో సమం చేసినా రెండు జట్ల మధ్య ఈ పోరు రసవత్తరంగా మారింది. గత మూడు రోజులుగా అక్కడ వర్షాల పడటం వల్ల గ్రీన్‌ఫీల్డ్స్‌ అంతర్జాతీయ మైదానం మొత్తాన్ని సిబ్బంది కవర్లతో కప్పి వుంచారు. అయితే సాయంత్రం వర్షం కురిసినా.. నిమిషాల వ్యవధిలోనే మైదానం సిద్ధం చేస్తామని కేరళ క్రికెట్‌ సంఘం అధికారులు తెలియచేశారు.