దూసుకెళ్తున్న "సూపర్ ఫాస్ట్"

SMTV Desk 2017-11-06 16:39:57  Railway Department, EXPRESS TRAINS, SUPER FAST TRAINS,

న్యూఢిల్లీ, నవంబర్ 6 : దయచేసి వినండి రైల్వే ప్రయాణికులకు ముఖ్య గమనిక. రైల్వే శాఖ 48 ఎక్స్ ప్రెస్ రైళ్లను సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ లుగా ఆఫ్ గ్రేడ్ చేసింది. అంతే కాదు ఈ 48 రైళ్ల టికెట్ ధరలను, ప్రయాణ వేగాన్ని పెంచింది. ఇకపై ఆయా రైళ్లల్లో ప్రయాణించేవారు స్లీపర్‌ కోచ్‌కు రూ.30, సెకండ్‌, థర్డ్‌ క్లాస్‌ ఏసీ కోచ్‌లకు రూ.45, ఫస్ట్‌ క్లాస్‌ ఏసీ కోచ్‌కు రూ.75 చొప్పున సూపర్‌ ఫాస్ట్‌ ఛార్జీలు కట్టాల్సి ఉంటుంది. దీని వల్ల రూ.70కోట్ల అదనపు ఆదాయం లభించే అవకాశముందని రైల్వేశాఖ అంచనా వేస్తోంది. ఈ 48 సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ రైళ్లతో కలిపి దేశంలో మొత్తం రైళ్ళ సంఖ్య 1, 072 కు పెరిగింది. ఇకపై తక్కువ సమయంలో ప్రయాణం చేయాలనుకునే వారు అధిక చార్జీలతో ప్రయాణం చేయవచ్చన్న మాట.