మహిళా క్రికెట్ లో అరుదైన రికార్డు

SMTV Desk 2017-11-06 16:30:28  under-19 women cricket, double century record by jamimah rodrgiz, smruthi mandan,

ఔరంగాబాద్, నవంబర్ 06 : మహిళా క్రికెట్ లో అరుదైన రికార్డు చోటు చేసుకుంది. ఔరంగాబాద్ వేదికగా సౌరాష్ట్రతో జరిగిన అండర్-19 మహిళా వన్డే క్రికెట్ టోర్నమెంట్ లో 16 ఏళ్ల ముంబై క్రీడాకారిణి జెమిమాహ్ రోడ్రిగ్జ్ ‌(202,పరుగులు ) ద్విశతకంతో చెలరేగిపోయారు. అంతే కాకుండా మహిళా అండర్ -19 వన్డే క్రికెట్ లో డబుల్ సెంచరీ చేసిన రెండో భారత మహిళగా రికార్డు సృష్టించారు. గతంలో అండర్ -19 భారత్ మహిళా జట్టులో స్మృతి మందన 224 పరుగులతో మొదటి రికార్డును నెలకొల్పారు.