అసెంబ్లీ నుంచి కాంగ్రెస్‌ వాకౌట్‌...

SMTV Desk 2017-11-06 11:18:28  Assembly, congress, Walkout, Hyderabad

హైదరాబాద్‌, నవంబర్ 06 : ప్రస్తుతం శీతాకాల సమావేశాల్లో భాగంగా తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ నుంచి కాంగ్రెస్ వాకౌట్ చేసింది. ఎస్సీ వర్గీకరణపై గతంలో ప్రభుత్వం ఇచ్చిన హామీ విస్మరించిందని, సభలో ఈ ప్రస్తావనపై సమాధానం చెప్పడం లేదని ప్రతిపక్ష నేత జానారెడ్డి పేర్కొన్నారు. ఎస్సీ వర్గీకరణపై ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్‌ మధుసూదనాచారి తిరస్కరించడంతో కాంగ్రెస్‌ సభ్యులు సభ నుంచి బయటకు వెళ్ళిపోయారు.