సౌదీ అరేబియా యువరాజు మృతి

SMTV Desk 2017-11-06 11:16:48  Saudi Arabia, Prince Mansour Bin Muirin pass away.

రియాద్, నవంబర్ 06 ‌: సౌదీ అరేబియా యువరాజు మన్సూర్‌ బిన్‌ ముక్రిన్‌ హెలికాప్టర్ లో ప్రయాణిస్తుండగా ప్రమాదం సంభవించడంతో ప్రాణాలు కోల్పోయారు. యెమెన్‌ సరిహద్దు ప్రాంతంలో ఏడుగురు అధికారులతో కలిసి హెలికాప్టర్‌లో ప్రయాణిస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈయనతో పాటు హెలికాప్టర్ లో ఉన్న మిగితా ఏడుగురు కూడా మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. దీంతో జరిగిన ఈ ప్రమాదంపై అధికారులు దర్యాప్తు చేపట్టారు. మన్సూర్‌.. రియాద్‌లోని అసిర్‌ ప్రావిన్స్‌కు డిప్యూటీ గవర్నర్‌ గా బాధ్యతలు నిర్వహించి, కొద్దికాలం పాటు మహారాజుగా బాధ్యతలు చేపట్టిన ముక్రిన్‌ బిన్‌ అబ్దుల్‌ అజీజ్‌ అల్‌ సౌద్‌ కుమారుడు కావడం గమనార్హం.