కుశాల్, కౌషల్‌ సిల్వాలకు దక్కని చోటు

SMTV Desk 2017-11-06 10:55:53  colombo, sri lanka team tour of bharath, kushal mendis koushal silva out, dinesh chandi mal

కొలంబో, నవంబర్ 06 : శ్రీలంక సెలెక్టర్లు బ్యాట్స్‌మన్‌ కుశాల్‌ మెండీస్, కౌషల్‌ సిల్వాలకు ఉద్వాసన పలికారు. భారత్ పర్యటనలో భాగంగా 15 మంది సభ్యులు గల శ్రీలంక జట్టును ఆదివారం ప్రకటించారు. ఇందులో సీనియర్ ఆటగాడు ఏంజెలో మాథ్యూస్‌ తిరిగి జట్టులో చోటు దక్కించుకొన్నారు. కోహ్లి సేనతో శ్రీలంక మూడు టెస్టులు, మూడు వన్డేలు,మూడు టీ20లు ఆడనుంది. శ్రీలంక జట్టు : దినేశ్‌ చండిమాల్‌ (సారథి), దిముత్‌ కరుణరత్నె, ధనంజయ డిసిల్వ, సదీర సమరవిక్రమ, ఏంజెలో మాథ్యూస్‌, లాహిరు తిరుమానె, రంగనా హెరాత్‌, సురంగ లక్మల్‌, దిల్‌రువాన్‌ పెరీరా, లాహిరు గమగే‌, లక్షన్‌ సందకన్‌, విశ్వా ఫెర్నాండో, దసున్‌ శనక, నిరోషన్‌ డిక్వెలా, రోషెన్‌ సిల్వ.