అమెరికాను వదలని ఉగ్ర పంజా..

SMTV Desk 2017-11-06 10:31:30  america, texas, Sutherland Springs First Baptist Church,

అమెరికా, నవంబర్ 6 : మొన్న ట్రక్ తో దాడి, నిన్న వాల్ మార్ట్ స్టోర్ లో కాల్పుల భీభత్సం.. ఈ ఘటనలు జరిగి నెల రోజులు గడవలేదు. కాని మరోసారి తుపాకి విష సంస్కృతికి మరో 87 మంది బలైపోయారు. టెక్సాస్ లోని ఓ చర్చిలోకి దుండగుడు చొరబడి విచక్షణా రహితంగా కాల్పులు జరిపాడు. స్థానిక కాలమాన ప్రకారం ఆదివారం ఉదయం 11:30 నిమిషాలకు ఇక్కడి సుదర్లాండ్‌ స్ప్రింగ్స్‌ ఫస్ట్‌ బాప్టిస్ట్‌ చర్చిలో ప్రార్ధన జరుగుతుండగా ఓ ఆగంతకుడు లోనికి ప్రవేశించి తుపాకితో కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో రెండేళ్ళ చిన్నారి సహా 27 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. 20 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటన స్థలికి చేరుకొని హెలికాప్టర్లు, అంబులెన్స్ ల ద్వారా క్షతగాత్రులను ఆసుపత్రికి తరలి౦చారు. కాల్పుల ఘటన అనంతరం దుండగుడు పారిపోతు౦డగా భద్రతా సిబ్బంది మట్టుబెట్టారు. ఈ ఘటనపై ప్రస్తుతం జపాన్ పర్యటనలో ఉన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.