"హి ఇజ్ మై బెస్ట్ ఫ్రెండ్" : కోహ్లి

SMTV Desk 2017-11-06 10:30:02  kohli interview, about dhonin issue, new delhi, comments on pandya, dhawan, rohit sharma

న్యూఢిల్లీ, నవంబర్ 06 : భారత్ క్రికెట్ జట్టు ప్రస్తుత సారధి విరాట్ కోహ్లి ధోని నుండి కెప్టెన్సీ పగ్గాలు తీసుకోవడంతో ఇరువురి మధ్య సంబంధాలు ఎలా ఉంటాయో అని చాలా మంది అనుమానపడ్డారు...! కొన్నిరోజుల తరువాత వీరి మధ్య విభేదాలున్నట్లుగా వూహాగానాలు వచ్చాయి. వీటిపై విరాట్ స్పందిస్తూ ధోనితో తన బంధం చాలా బలమైనదని, ఏళ్లు గడుస్తున్న కొద్దీ మా స్నేహం మరింత పటిష్టమవుతుండడం తనకు సంతోషాన్నిచ్చే విషయమని వివరించారు. మ్యాచ్‌కు సంబంధించిన ప్రణాళికల్లో ధోనీకి తిరుగులేదు. అతడో క్రికెట్‌ మేధావి. సహజంగా నా ఆలోచనలకు తగ్గట్టుగా వెళతాను. కానీ ఎప్పుడైనా నేను ఓ పది విషయాల్లో ధోనిని సలహా అడిగితే అందులో ఎనిమిది ఫలితాన్నిస్తాయని కోహ్లి వ్యాఖ్యానించారు. భారత్ ఆటగాళ్ళలో పాండ్య, ధావన్ చాలా హాస్య చతురత కలవారని, రోహిత్ శర్మ విచిత్రమైన వ్యక్తి అని ఎప్పుడూ ఏదో ఒకటి పోగొట్టుకుంటూ ఉంటాడని అయిన ఆందోళన లేకుండా చాలా తేలిగ్గా ఇంకోటి కొనుక్కుందాం అంటాడు. అని కోహ్లి చెప్పుకొచ్చారు.