చలికాలంలో పెదవులు మృదువుగా ఉండాలంటే..

SMTV Desk 2017-11-05 18:30:49  beauty tips of lips.

హైదరాబాద్, నవంబర్ 05: మీ పెదవులు చలికి పగలడం, చిట్లడం జరుగుతోందా..? పెదవులు మృదుత్వాన్ని కోల్పోతున్నాయని బాధపడుతున్నారా..? అయితే ఈ చిన్ని చిట్కాతో మీ పెదవులకు అందాన్ని అద్దండి. చెంచా చొప్పున తేనె, చక్కెరా, బాదం నూనె కలిపి పెదవులకు రాసుకోవాలి. తరవాత కనీసం ఐదు నిమిషాలు నెమ్మదిగా మర్దన చేయాలి. ఇలా రెండురోజులకోసారి చేయడం వల్ల పొడి బారే సమస్య తగ్గి ఆరోగ్యంగా మారతాయి. పెదవులు పొడిబారడానికి, నిర్జీవంగా కనిపించడానికి కారణం వాటిపై మృతకణాలు పేరుకోవడమే. ఇలాంటి సమస్య ఉన్నవారు కీరా ముక్కను తీసుకుని పెదవులపై రుద్ది, కాసేపయ్యాక కడిగేయాలి. ఇలా వారానికోసారి చేస్తే ఫలితం ఉంటుంది. నిమ్మకాయ ముక్కపై కాస్త చక్కెర వేసి రుద్దినా మృతకణాలు పోతాయి. గులాబీ రేకుల ముద్దలో కాస్త బాదం నూనె కలిపి పెదవులకు పూతలా వేసి, ఆరాక కడిగేస్తే పెదవులు మృదువు గాను, తాజా గానూ కనిపిస్తాయి.