జయహో భారత్..

SMTV Desk 2017-11-05 18:03:03  asia cup womens hockey, final winer india, defeted china, kagamigahara, japan

కకామిగహర, నవంబర్ 05 : భారత్ మహిళా హాకీ జట్టు తిరుగులేని ప్రదర్శనతో చైనాను మట్టికరిపించింది. ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్ లో డ్రాగన్ దేశంపై 5-4 తో టీమిండియా విజయం సాధించింది. హోరా హోరిగా సాగిన ఈ మ్యాచ్ లో భారత్ అమ్మాయిల జట్టు అద్భుతంగా ఆడింది. ఈ విజయంతో భారత్ ఆసియా ఛాంపియన్ గా రెండవ సారి అవతరించింది. ఇంతకు ముందు 2004 ఢిల్లీలో జపాన్ తో జరిగిన మ్యాచ్ లో విజేతగా నిలిచింది. ఆసియాకప్‌ విజేతగా నిలిచిన భారత్‌ 2018లో జరిగే మహిళల ప్రపంచకప్‌కు నేరుగా అర్హత పొందింది.