జాతీయ గీతాలాపనకు 50 వేల మంది : వసుంధరా రాజే

SMTV Desk 2017-11-05 17:40:59  vasundhara raaje national anthem programme

జైపూర్, నవంబర్ 05: భారత ప్రధాని మోదీని అత్యంత గౌరవించే బీజేపీ నేతల్లో రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధరా రాజే అగ్ర భాగాన ఉంటారు. ప్రధానిగా మోదీ తీసుకున్న కీలక నిర్ణయాల్లో ఆమె వెన్నంటే ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం నోట్ల రద్దు నిర్ణయం ప్రకటించి నవంబర్ 8 తో సంవత్సర౦ పూర్తవుతున్న నేపధ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తరపున ఒక భారీ కార్యక్రమం రూపొందించారు. ఈ నెల 8వ తేదీన నిర్వహించే నల్లధనం వ్యతిరేక కార్యక్రమంలో 50 వేల మందితో జాతీయ గీతాలాపన చేయించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. కాంగ్రెస్ నిరసనల నేపధ్యంలో వసుంధరా రాజే ఈ భారీ కార్యక్రమాన్ని రూపొందించి ఉండవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.