రష్యా జిమ్నాస్ట్ సంచలన నిర్ణయం

SMTV Desk 2017-11-05 16:47:15  russia gymnasts retirement, Margarita Mamun. olympic gold medal winner, brazil

మాస్కో, నవంబర్ 05 : 2016 బ్రెజిల్ లోని రియోడీజనీరోలో జరిగిన రిథమిక్ జిమ్నాస్టిక్ పోటీలో పసిడి పతకం సాధించిన, రష్యా జిమ్నాస్ట్ మార్గరీటా మామున్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. కేవలం 22 సంవత్సరాల వయసులో తన కెరీర్‌కు గుడ్ బై చెప్పారు. రష్యా-బంగ్లాదేశ్ దంపతులకు మాస్కోలో జన్మించిన మార్గరీటా తన కెరీర్‌లో ఓవరాల్‌గా 28 స్వర్ణాలు, 13 రజతాలు, ఓ కాంస్యంతో జిమ్నాస్టిక్స్ లో మంచి రికార్డులు సొంతం చేసుకున్నారు.