వెల్‌కం అన్నందుకు చావగొట్టాడు..

SMTV Desk 2017-11-05 16:42:40  Robertsganj Railway Station, Germany, ailway employee

లఖ్ నవూ, నవంబర్ 5 : ఓ విదేశీయుడు, భారతీయుడిపై అసభ్యకరంగా ప్రవర్తించాడు. జర్మనీకి చెందిన హోల్గర్‌ ఎరిక్‌ అనే వ్యక్తి విహారయాత్ర నిమిత్తం అగోరీ కోటకు వచ్చాడు. ఈ నేపథ్యంలో అతను రాబర్ట్స్‌ గంజ్‌ రైల్వే స్టేషన్‌ వద్ద దిగుతుండగా అదే స్టేషన్‌లో పనిచేస్తున్న అమన్‌ యాదవ్‌ అనే ఉద్యోగి ఎరిక్‌ను చూసి గౌరవంగా "వెల్‌కం టు ఇండియా " అన్నాడు. దాంతో అతను అమన్‌పై ఉమ్మేసి అమర్యాదకరంగా ప్రవర్తించాడు. దాంతో అమన్‌ ఎరిక్‌ను చావగొట్టాడు. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు ఇద్దరినీ పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు. అసలు ఏమైంది అని విచారించగా, అమన్‌ జరిగిన విషయం తెలిపాడు. కానీ ఎరిక్‌ అమన్‌పై కేసు పెట్టే హక్కు తనకుందని వాదించాడు.