ఆమె రాకకై నగరంలో హైఅలర్ట్

SMTV Desk 2017-11-05 16:42:20  Ivanka Trump, Hyderabad tour, Taj Falaknuma palace

హైదరాబాద్, నవంబర్ 05 : అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవా౦కా.. పర్యటనలో భాగంగా ఈ నెల 28, 29 వ తేదీల్లో భారత్ రానున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లో పర్యటించనున్న ఇవా౦కాకు తెలంగాణ రాష్ట్ర ఇంటెలిజెన్స్‌ అధికారులు తాజ్ ఫలక్‌నుమాలో డిన్నర్ ఏర్పాటు చేయనున్నారు. ఇందు నిమిత్తం ఇప్పటికే సీక్రెట్‌ సర్వీస్‌ బృందంతో కలిసి చర్చించినట్లు సమాచారం. ఈ పర్యటన ముగిసేంత వరకు ఇవా౦కా మాదాపూర్ లోని రహేజా మైండ్‌ స్పేస్‌లో బస చేయనున్నట్లు తెలుస్తోంది. ఆమె భారత్ రానున్న తరుణంలో సుమారు 500 మంది భద్రత సిబ్బందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు. కాగా జీఈఎస్‌ (గ్లోబల్‌ ఎంట్రప్రెన్యూర్‌ సమిట్‌)లో పాల్గొనేందుకు ఇవాంకా హైదరాబాద్‌ రానున్నారు.