రీల్ హీరో కాదు.. రియల్ హీరో..

SMTV Desk 2017-11-05 15:54:51  mahesh babu, burripalem, srimanthudu,

హైదరాబాద్, నవంబర్ 5: "శ్రీమంతుడు" సినిమాతో ఘన విజయం సాధించాడు సూపర్ స్టార్ మహేష్ బాబు. అయితే అందులో "ఊరిని దత్తత తీసుకోవడమంటే.. జేబులో డబ్బులు తీసి, రంగులు, రోడ్లు వేసి వెళ్లిపోతాననుకున్నార్రా..? వీడిని, వాడిని, వీళ్లందరినీ, నిన్ను మొత్తాన్ని దత్తత తీసుకున్నా" అనే డైలాగ్ అందరికీ ఆదర్శనీయంగా మారింది. ఈ సినిమా తర్వాత మహేష్ తన స్వస్థలం బుర్రిపాలెంను, తెలంగాణలో సిద్దాపూర్‌ను దత్తత తీసుకున్న విషయం విదితమే. సిద్దాపూర్‌ను తన భార్య నమ్రతా చూసుకుంటున్నారు. బుర్రిపాలెంలో తన బావ, ఎంపీ గల్లా జయదేవ్ సహకారంతో, ప్రతినెలా బుర్రిపాలెంలో ఆంధ్రా హాస్పిటల్స్ సహకారంతో హెల్త్ చెకప్స్ జరుగుతుంటాయి. వీటిలో భాగంగా గుండె సంబంధిత వ్యాధులతో బాధపడే 99 మంది చిన్నారులను గుర్తించారు. వార౦దరికీ 6 క్యాంపులు నిర్వహించి ఆపరేషన్లు చేయించి వారి ప్రాణదాతగా మారారు. తాజాగా గుండె సంబంధిత ఆపరేషన్లు చేయించుకున్న చిన్నారుల ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఆంధ్రా హాస్పిటల్స్‌కి బెస్ట్ విషెస్ తెలిపారు మహేశ్. దీంతో అందరు మహేష్ బాబును ఆదర్శంగా తీసుకోవాలని భావిస్తున్నారు.