కేసిఆర్ చరిత్రను కాపాడుతున్నారు : యనమల

SMTV Desk 2017-11-05 15:39:25  yanamala rama krishnudu, telangana cm, kcr, yadadri

హైదరాబాద్, నవంబర్ 5 : రాష్ట్రంలోని దేవాలయాలను ముఖ్యమంత్రి కేసిఆర్ అభివృద్ధి చేస్తున్నారని, ఏపీ ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. నేడు ఆయన కుటుంబ సమేతంగా యదాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. దేవాలయాలను అభివృద్ధి చేయడమంటే, చరిత్రను కాపాడటమేనని పేర్కొన్నారు. యాదాద్రికి చాలా గొప్ప చరిత్ర ఉందని, తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాలను రక్షించుకోవాల్సిన బాధ్యత ఇరు రాష్ట్ర ప్రభుత్వాలపై ఉందని అన్నారు. ఇరు రాష్ట్రాల ప్రజలు సుభిక్షంగా ఉండాలని భగవంతుడిని కోరుకున్నానని తెలిపారు. ఏపీకి తిరుమల వలే, తెలంగాణకు యాదాద్రి తలమానికంగా నిలవాలని ఆకాంక్షి౦చారు.