ఆర్టికల్ 370 మా రాజ్యాంగ హక్కు : మెహబూబా

SMTV Desk 2017-11-05 15:24:09   Jammu and Kashmir Chief Minister, Mehbooba mufthi, artical 370.

శ్రీనగర్, నవంబర్ 05: ఆర్టికల్ 370 పై భిన్న వాదనలు వినిపిస్తున్న తరుణంలో జమ్మూ కశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ మౌనం వీడారు. జమ్మూ కాశ్మీర్‌ కు ప్రత్యేక హోదా కల్పించే ఈ అధికరణ, తమ రాష్ట్ర ప్రజలకు భారత్ ఇచ్చిన హామీ అని, దీనిని కొనసాగించాల్సిందేనని ఆమె స్పష్టం చేశారు. రాజ్యాంగ హక్కు అయిన దానిని దేశ ప్రజలు అందరూ గౌరవించాలని సూచించారు. రాజకీయాలకు ఈ అధికరణ వేదిక కాకూడదన్న ఆమె ఇటీవల జరిగిన పరిణామాలకు విచారం వ్యక్తం చేశారు. ఇటువంటి సున్నితమైన అంశాలలో రాజ్యాంగానికి లోబడి స్పంది౦చాలని, చర్చల ద్వారానే సమస్యలు పరిష్కారమవుతాయని వ్యాఖ్యానించారు. కాశ్మీర్‌ అంశంపై ప్రధాని మోడీ సరికొత్త చరిత్ర రాయనున్నట్లు తెలిపారు.