కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి హౌస్ అరెస్ట్

SMTV Desk 2017-11-05 15:01:40  about jaggareddy house arrest, jaggareddy under police contol

సంగారెడ్డి, నవంబర్ 05 : కాంగ్రెస్ నేత, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్‌ రెడ్డిని పోలీసులు ఆదివారం హౌస్ అరెస్ట్ చేశారు. సింగూరు జలాలను శ్రీరాంసాగర్ కు తరలిస్తామని తెలంగాణ భారీ నీటి పారుదల శాఖా మంత్రి హరీష్‌రావు అసెంబ్లీలో ప్రకటించిన సంగతి విదితమే. దీనిని తీవ్రంగా నిరసిస్తూ నేడు జరిగే మంత్రి హరీష్‌రావు పర్యటనను అడ్డుకోవాలని జయప్రకాశ్‌ రెడ్డి పిలుపునిచ్చారు. అయితే.. మంత్రి పర్యటనను అడ్డుకుంటారనే సమాచారంతో ముందస్తు జాగ్రత్తలలో భాగంగా జగ్గారెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఆయన ఇంట్లో నుంచి బయటకు రాకుండా ఉండేందుకు ఇంటి వద్ద పోలీసులను మోహరించారు. దీనిని జగ్గారెడ్డి తీవ్రంగా ఖండిస్తూ, తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని తెరాస ప్రభుత్వం ఖూని చేస్తు౦దని ఆరోపించారు.