సెపక్‌తక్రా ప్రపంచకప్‌లో భారత్ పరాజయం..

SMTV Desk 2017-11-05 14:46:27  sepak takraw game, india loss, venue hyderabad, malayasia won

హైదరాబాద్, నవంబర్ 05 : తొలిసారి భారత్ వేదికగా జరుగుతున్నా సెపక్‌తక్రా ప్రపంచకప్‌లో ఇండియా ఆటగాళ్ళ పోరాటం ముగిసింది. గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి స్టేడియంలో జరుగుతోన్న ఈ టోర్నీలో భారత్ పురుషుల జట్టు సెమీ ఫైనల్లో, మలేషియా చేతిలో 16–21, 8–21 తో ఓటమి పాలైంది. భారత్ మహిళా జట్టు క్వార్టర్స్‌లోనే ఇంటిదారి పట్టారు. ఈ సెపక్‌తక్రా ఆట మలేషియా, ఇండోనేషియా, థాయిలాండ్ దేశాల్లో చాలా ప్రాముఖ్యత పొందింది.