రుజువు చేసుకో శ్రీశాంత్ : కపిల్ దేవ్

SMTV Desk 2017-11-05 13:09:40  sreesanth ipl scam, former crickter kapi dev talks about sree santh, bcci, supreme court

బెంగుళూరు, నవంబర్ 05 : 2013 ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్‌ కుంభకోణ౦ విషయంలో బీసీసీఐ తనపై జీవితకాల నిషేధం విధించడం పట్ల శ్రీశాంత్‌ మండిపడుతున్న సంగతి తెలిసిందే. ఈ విషయంలో బోర్డుపై సుప్రీమ్ కోర్టులో పోరాడేందుకు కూడా అతను సిద్ధమవుతున్నాడు. ఈ సందర్భంగా కపిల్ మాట్లాడుతూ.. "బీసీసీఐ తనపట్ల పక్షపాతంగా వ్యవహరిస్తుందనేది శ్రీశాంత్‌ వ్యక్తిగత అభిప్రాయం. దానిపై నేనేమీ మాట్లాడను కానీ అదే నిజమైతే రుజువులతో రావాలని శ్రీశాంత్‌ను కోరుతున్నాను" అని వ్యాఖ్యానించారు.