రూ.70 కోసం బట్టలు విప్పించేసింది

SMTV Desk 2017-11-05 13:05:56  teacher harassment on student, bhopal,

భోపాల్, నవంబర్ 5 : తరగతి గదిలో బట్టలు విప్పించి ఓ ఉపాధ్యాయురాలు అసభ్యంగా ప్రవర్తించిన ఘటన మధ్యప్రదేశ్‌లోని దమోహ్‌ పాఠశాలలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే... దమోహ్‌లోని రాణి దుర్గావతి హైస్కూల్లో పదో తరగతి బాలికల విభాగంలో దొంగతనం జరిగింది. ఒక బాలిక 70 రూపాయలను దొంగిలించిందనే అనుమానాన్ని బాధితురాలిపై తోటి విద్యార్థిని ఆరోపించింది. దీంతో మొదట బాధితురాలి పుస్తకాల బ్యాగును సోదా చేశారు. అందులో డబ్బులు దొరకకపోవడంతో బాధితురాలి బట్టలు విప్పించి మరీ వెతికించింది ఆ టీచర్‌. తరగతి గదిలో అందరి ముందు జరిగిన అవమానాన్ని ఆ బాలిక తన తల్లిదండ్రులకు, స్కూల్ యాజమాన్యానికి వివరించింది. ఈ వార్త సోషల్ మీడియాలో హల్‌చల్ చేయడంతో స్పందించిన డీఈవో పాఠశాలకు షోకాజ్ నోటీసు జారీ చేశారు.