కోహ్లి @ హ్యాపీ బర్త్ డే

SMTV Desk 2017-11-05 11:18:51  kohli 29 th birth day, celebrate in raj kot hotel, with team india cricket players, pandya

న్యూఢిల్లీ, నవంబర్ 05 : విరాట్ కోహ్లి.. ప్రస్తుత టీమిండియా కెప్టెన్ గా క్రికెట్ రంగంలో దూసుకుపోతున్న ఈ యువ కెరటం ఈ రోజు తన 29 వ బర్త్ డే జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా కోహ్లికి ప్రముఖులు, నెటిజన్ల నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. నిన్న కివీస్ తో జరిగిన మ్యాచ్ అనంతరం రాజ్ కోట్ హోటల్ లో విరాట్ తన టీంతో పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుపుకొన్నారు. ఈ వేడుకలో భాగంగా క్రికెటర్ పాండ్య కోహ్లి ముఖం మొత్తం కేక్ పూసిన ఫోటోలను ట్విటర్‌లో పోస్ట్‌ చేస్తూ.. "రివెంజ్‌ నెం.1" అని ట్వీట్‌ చేశారు.