లెబనాన్ ప్రధాని రాజీనామా

SMTV Desk 2017-11-05 10:39:13  Lebanon prime minister, Saad Al Hariri, Beirut

బీరూట్, నవంబర్ 5 : "లెబనాన్ పై ఇరాన్ ప్రభావం ఎక్కువగా ఉంది. నా తండ్రి, మాజీ రఫీక్‌ అల్‌ హరిరి హత్యకు ముందు దేశంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో.. ప్రస్తుతం కూడా అలాంటి పరిస్థితులే చోటుచేసుకుంటున్నాయి" అంటూ లెబనాన్‌ ప్రధానమంత్రి సాద్‌ అల్‌ హరిరి శనివారం ఆకస్మిక రాజీనామా చేశారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా టెలివిజన్ ద్వారా వెల్లడించారు. తన ప్రాణాలకు ముప్పు ఉందని, తనను చంపేందుకు ప్రణాళికలు రచిస్తున్నారని హరిరి అన్నారు. ఇంకా రాజీనామాపై పూర్తి వివరాలు తెలియాల్సి వుంది.