భారత్ కు పరాభవం.. మెరిసిన మున్రో..

SMTV Desk 2017-11-05 10:34:40  raj kot india- kiwis 2 nd t-20, kiwis won, india loss, munro century, kohli

రాజ్ కోట్, నవంబర్ 05 : రాజ్ కోట్ వేదికగా భారత్- కివీస్ మధ్య జరిగిన రెండో T-20 లో కోహ్లి సేన పరాజయాన్ని చవిచూసింది. అన్ని రంగాల్లో ఆధిపత్యం చెలాయించిన ప్రత్యర్ధి జట్టు ఈ విజయంతో సిరీస్ ను 1-1 తో సమం చేసింది. ఇక ఫలితం తేల్చే చివరి మ్యాచ్ ఈ నెల 7 న తిరువనంతపురంలో జరగనుంది. మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నన్యూజిలాండ్‌ కు ఆదిరే ఆరంభం దక్కింది. భారత్ ఆటగాళ్ళ పేలవ ఫీల్డింగ్ వల్ల మున్రో (109) శతకం సాధించడంతో కివీస్ 196 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య చేధనలో టీమిండియా 156/7 కు పరిమితమైంది. భారత్ జట్టు లో సారథి కోహ్లి(65) , ధోని(49), పరుగులతో పోరాడినప్పటికీ మిగతా బ్యాట్సమన్ నుండి సహకారం లభించకపోవడంతో భారత్ కు పరాభవం తప్పలేదు. న్యూజిలాండ్‌ బౌలర్‌ ట్రెంట్‌బౌల్ట్‌ 4 వికెట్లు తీసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు