టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కివీస్..

SMTV Desk 2017-11-04 19:10:38  RAJ KOT, TOSS WON BY KIWIS, INDIA BOWLING, SIRAJ DEBUT

రాజ్ కోట్, నవంబర్ 04 : కివీస్ తో జరుగుతున్నరెండో T-20 లో న్యూజిలాండ్‌ కెప్టెన్ విలియమ్సన్‌ టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్నారు. తోలి పోరులో గెలిచిన కోహ్లి సేన ఈ మ్యాచ్ లో విజయం సాధించి సిరీస్ ను చేజిక్కించుకోవాలని చూస్తుంది. ఈ మ్యాచ్ ద్వారా హైదరాబాద్ పేసర్ మొహ్మద్ సిరాజ్ భారత జట్టులోకి అరంగేట్రం చేశాడు. ఐపీఎల్‌లో సిరాజ్ సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ తరఫున బౌలింగ్‌లో అద్భుతంగా రాణించాడు.