మాఫియా డాన్ గా దీపికా పదుకొణె..!

SMTV Desk 2017-11-04 18:46:22  Deepika Padukone, Mafia biopic, director Vishal Bhardwaj

ముంబై, నవంబర్ 04 : బయోపిక్ ల పరంపర కొనసాగుతూనే ఉంది. బాలీవుడ్‌ లో వరుస విజయాలతో స్టార్‌ హీరోలకు పోటీ ఇస్తున్న దీపిక పదుకొణె, తాజాగా మరో బయోపిక్ ఓకే చేసింది. 1980 లలో ముంబయిని వణికించిన మాఫియా క్వీన్‌ సప్నా దీదీ జీవితాధారంగా ఈ సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమాకు ప్రముఖ బాలీవుడ్‌ దర్శకుడు విశాల్‌ భరద్వాజ్‌ టీంలో చాలా కాలంగా దర్శకత్వ శాఖలో పనిచేస్తున్న హనీ దర్శకత్వం వహించను౦డగా, విశాల్ ఈ సినిమాను నిర్మిస్తుండడం విశేషం. పీకు సినిమాతో సక్సెస్‌ఫుల్‌ పెయిర్‌ అనిపించుకున్న దీపిక పదుకొణె, ఇర్ఫాన్‌ ఖాన్‌ లు ఈ బయోపిక్‌ కోసం మరోసారి జోడి కడుతున్నారు. ప్రస్తుతం పద్మావతి ప్రమోషన్‌ కార్యక్రమాల్లో బిజీగా ఉన్న దీపిక, ఆ పనులు పూర్తయ్యాక బయోపిక్‌ షూటింగ్‌లో పాల్గొననుంది. డాన్ గా దీపికా ఎలా అలరిస్తుందో అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.