జాక్ నా సమస్యకు పరిష్కారం చెప్పాడు : కోహ్లి

SMTV Desk 2017-11-04 16:58:03  indian cricket captain kohli, programme breakfast with champions, zaheer khan, rajkot

రాజ్‌కోట్‌, నవంబర్ 04 : తన జీవితంలో ఒక కీలక సమస్యను మాజీ ఫాస్ట్ బౌలర్ జహీర్‌ఖాన్‌కు వివరించగా పరిష్కారం తెలిపాడని భారత్ జట్టు సారధి కోహ్లి వివరించాడు. తాజాగా ‘బ్రేక్‌ ఫాస్ట్‌ విత్‌ ఛాంపియన్స్‌’ కార్యక్రమంలో పాల్గొన్న కోహ్లీ ఎన్నో ఆసక్తికరమైన విషయాలను బయటపెట్టాడు. 2011 ప్రపంచ కప్, 2013 ఛాంపియన్స్‌ ట్రోఫీ, టెస్టుల్లో నెంబర్‌వన్‌ ర్యాంకు కైవసం చేసుకోవడం నా జీవితంలో మరిచిపోలేని క్షణాలని వెల్లడించాడు. 2014 లో ఇంగ్లాండ్ పర్యటన నా కెరీర్‌లోనే చెత్తదశ అని, అప్పుడు నేను సరిగా రాణించలేకపోయాను. నా వైఫల్యానికి కారణం అనుష్క అని చాలా మంది అన్నారు. నేను బాగా ఆడకపోతే చాలు అనుష్కను ఎందుకు కారణంగా చూపుతారో నాకు ఇప్పటికీ తెలియదు. అన్నింటికి ఆమెనే కారణంగా చూపుతుండడంతో ఈ విషయంపై జహీర్‌ ఖాన్‌తో చర్చించగా జాక్ నాకు చాలా ధైర్యం చెప్పాడని కోహ్లీ తెలిపారు.