పీవీ సింధుకి చేదు అనుభవం

SMTV Desk 2017-11-04 15:58:53  PV Sindhu bad experience, indigo airlines Counters Claim, stafff rude behaviour, mumbai

ముంబై, నవంబర్ 04 : భారత్ బ్యాడ్మింటన్‌ స్టార్‌, రియో ఒలింపిక్ పతక విజేత పీవీ సింధుకు చేదు అనుభవం ఎదురైంది. తను ప్రయాణించిన ఇండిగో ఎయిర్ లైన్ విమానంలో సిబ్బంది తనతో చాలా అనుచితంగా ప్రవర్తించారని పీవీ సింధునే తన ట్విట్టర్‌ ఖాతా ద్వారా వెల్లడించారు. "హైదరాబాద్ నుండి ముంబైకి వెళ్తున్న నాతో గ్రౌండ్‌ స్టాఫ్‌ అజితేష్‌ అనాగరికంగా ప్రవర్తించాడు. ఎయిర్‌హోస్టస్‌ అషిమా ప్రయాణికులతో మంచిగా ప్రవర్తించాలని పలు మార్లు సూచించింది. అయినప్పటికీ ఆమెతో కూడా ఆయన అమర్యాదపూర్వకంగా ప్రవర్తించాడు. దాన్ని చూసి నేను చాలా షాక్‌ అయ్యా. ఇలాంటి వ్యక్తులను ఇక్కడ పనికి పెట్టుకుంటే, ఇండిగో ఎయిర్‌లైన్స్‌ గౌరవ మర్యాదలు దెబ్బతింటాయి' అని ట్వీట్‌ చేశారు.