హాట్ హాట్ ఫోటో షూట్ లో మిథాలీ..

SMTV Desk 2017-11-04 15:17:07  MITHILI RAJ HOT PHOTO SHOOT, INDIAN WOMEN CRICKET TEAM CAPTAIN, ABOUT DRESS SENSE, BADMINTON PLAYER GUTTHA JWALA

హైదరాబాద్, నవంబర్ 04 : ప్రస్తుత కాలంలో సెలబ్రిటీల వ్యక్తిగత ఫొటోలపై నెటిజన్లు పెదవి విరుస్తున్నారు. ముఖ్యంగా వస్త్రధారణ విషయంలో సినీ తారలు, క్రీడాకారిణిలు శ్రుతి మించుతున్నారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. తాజాగా భారత్ మహిళా క్రికెట్ జట్టు సారధి మిథాలీ రాజ్‌, ఓ మొబైల్ సంస్థకు ప్రచారకర్తగా తీసిన ఫోటో షూట్ లోని హాట్ హాట్ చిత్రాలు అంతర్జాలంలో తెగ హల్ చల్ చేస్తున్నాయి. గతంలో మిథాలీ తన స్నేహితులతో కలిసి దిగిన ఫొటో వివాదాస్పదమైన విషయం తెలిసిందే. క్రీడాకారుల వస్త్రధారణ విషయంలో జరుగుతున్న వ్యతిరేక ప్రచారాన్ని లెక్క చేయబోనని బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి గుత్తా జ్వాల ఓ హాట్‌ ఫొటోను పోస్ట్ చేసి వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే.