మొరాయించిన మెసేంజర్‌..

SMTV Desk 2017-11-04 12:55:33  MESSENGER CRASH UP, USERS COMPLIANT, SERVER DOWN, OPERATED BY FACEBOOK

న్యూఢిల్లీ, నవంబర్ 04 : వాట్సాప్‌ సేవలకు అంతరాయం కలిగి 24 గంటలైన గడవలేదు. ఇప్పుడు మెసేంజర్‌ సర్వీసులకు తాత్కాలిక అంతరాయం ఏర్పడినట్టు తెలుస్తోంది. మెసేంజర్‌ ద్వారా ఎలాంటి మెసేజ్‌లను పంపించడం, స్వీకరించడం కుదరడం లేదని యూజర్లు వాపోతున్నారు. 'ఫేస్‌బుక్‌ మెసేంజర్‌ సర్వీసులకు అంతరాయం ఏర్పడింది.. నా మెసేజ్‌లన్నీ కనిపించడం లేదు. ఎవర్ని కాంటాక్ట్‌ చేయాలో తెలియడంలేదు... ప్లీజ్‌ నాకు సాయం చేయండి' అంటూ ఓ యూజర్ ట్వీట్‌ చేశారు. నిన్న కూడా ఇదే మాదిరి వాట్సాప్‌ సేవలకు అంతరాయం ఏర్పడింది.