ప్రపంచంలోనే నెం.1 అంటా కోహ్లి

SMTV Desk 2017-06-09 15:50:33  kohli, cristyano ronaldo, forbs,

న్యూయార్క్, జూన్ 09 : దేశంలో అత్యధిక సంపాదన కల్గిన క్రీడాకారుడిగా టీమిండియా కెప్టనే విరాట్ కోహ్లి నిలిచారు. ఆదాయంలో ప్రపంచ నెంబర్ వన్ క్రిడాకారుడిగా క్రిస్టియానో రొనాల్డో ప్రథమ స్థానంలో నిలిచారు. ఆయన సంపాదన 93 మిలియన్ డాలర్లు..భారత కరెన్సీ ప్రకారం 636 కోట్లు. ప్రపంచ వ్యాప్తంగా గణించిన మెుదటి వంద మంది జాబితాలో 89 వ స్థానాన్ని దక్కించుకోగా, దేశం నుండి మాత్రం ఆ జాబితాలో ఆయనోక్కడికే స్థానం దక్కింది. కెట్ రికార్డులను నమోదు చేసిన ఈ ఆటగాడు ఆదాయంలో కూడా ప్రపంచ వంద మంది జాబితాలో నిలుచి మరో ఘనత ను దక్కించుకున్నాడు. ఫోర్బ్స పత్రిక విడుదల చేసిన టాప్ - 100 జాబితాలో కోహ్లికి చోటు దక్కింది. టాప్ - 100 జాబితాలో కోహ్లి 22 మిలియన్ డాలర్లతో (141 కోట్లు) తో 89 వ స్థానం లభించింది. 3 మిలియన్ డాలర్లు మ్యాచ్ ఫీజుల ద్వారా అందుకుంటుండగా, 19 మిలియన్ డాలర్లు ఎండార్స్ మెంట్ ల ద్వారా పొందారు. 2016 జూన్ నుండి 2017 జూన్ మధ్య ఆదాయాన్ని పరిగణలోకి తీసుకొని ఫోర్బ్స్ ఈ జాబితాను రూపొందించింది.