రాష్ట్రానికి ఇన్‌ఛార్జి డీజీపీగా మహేందర్‌రెడ్డి

SMTV Desk 2017-11-04 12:26:10  Police Commissioner Mahender, Telangana cm kcr, hyderabad

హైదరాబాద్, నవంబర్ 04 ‌: రాష్ట్ర పోలీసు దలపతిగా హైదరాబాద్ కమిషనర్ మహేందర్‌రెడ్డికి బాధ్యతలు అప్పగించేందుకు రంగం సిద్దమైంది. అనురాగ్ శర్మ ఈ నెల 12న పదవి విరమణ చేయనున్నందున కొత్త డీజీపీగా మహేందర్‌రెడ్డిని నియమించేందుకు సర్కార్ సూత్రప్రాయంగా నిర్ణయించింది. అందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆమోద ముద్ర వేసినట్లు సమాచారం. ఇన్‌ఛార్జి హోదాతో ఆయనకు బాధ్యతలు అప్పగించిన తరువాత పూర్తి స్థాయి నియామకపు ప్రక్రియ చేపట్టనుంది. అనురాగ్‌శర్మ స్థానంలో 1986 ఐపీఎస్‌ బ్యాచ్‌కు చెందిన మహేందర్‌రెడ్డి నియామకం వైపే ప్రభుత్వం మొగ్గు చూపింది. 1962 డిసెంబరు 3న జన్మించిన ఆయనకు 2022 డిసెంబరు వరకు పదవీకాలం ఉంది.