నాకు మిగిలిన అవకాశం ఒక్కటే : క్రికెటర్ శ్రీశాంత్

SMTV Desk 2017-11-04 11:05:21  bowler sreesanth, ipl scam issue, supreme court, spot fixing

బెంగుళూరు, నవంబర్ 04 : 2013 స్పాట్‌ ఫిక్సింగ్‌ కుంభకోణానికి సంబంధించి తనపై బీసీసీఐ విధించిన నిషేధాన్ని సర్వోన్నత న్యాయస్థానంలో తేల్చుకుంటానని కేరళ క్రికెటర్‌ శ్రీశాంత్‌ నిర్ణయించుకున్నాడు . "ఇక నాకు మిగిలిన అవకాశం సుప్రీం కోర్టుని ఆశ్రయించడమే. క్రికెట్ మినహా నా జీవితంలో అన్ని సాఫీగా సాగుతున్నాయి. క్రికెట్ ఆడటం నా హక్కు, నా హక్కు కోసం నేను పోరాడతాను" అని వ్యాఖ్యానించాడు