జీఎస్ టీ ద్వారా పసిడి మార్కెట్ పారదర్శకత

SMTV Desk 2017-06-09 15:13:28  gold, gst on gold, wgc, regularization

ముంబై, జూన్ 09 : దేశంలో అమల్లోకి రానున్న వస్తుసేవల పన్ను (గూడ్స్ సర్వీస్ ట్యాక్స్ (జీ ఎస్ టీ)) పై ప్రపంచ స్వర్ణ మండలి సానుకూలంగా స్పందించింది. జీఎస్ టీ అమలును స్వాగతించింది. జీఎస్ టీ అమల ద్వారా స్వర్ణకార పరిశ్రమ క్రమబద్దీకరించబడి పసిడి సరఫరా చైన్ పారదర్శకంగా, పటిష్టంగా తయారవుతుందని అభిప్రాయపడింది. జీఎస్ టీ అమలు తరువాత పసిడి కొనుగోళ్ళపై స్వల్ప పన్ను భారం పడినప్పటికీ, ప్రతికూల ప్రభావం ఉండదని స్వర్ణ మండలి వివరించింది. కేవలం మూడు శాతం మాత్రమే పన్ను విధించాలని కేంద్రం నిర్ణయించిందని వివరించింది. దేశంలో 90 సంస్కరణల పథం ప్రారంభమైన తరువాత దేశంలో చేపడుతున్న అతిపెద్ద ద్రవ్య సంస్కరణ అని సమర్థించింది. పసిడి ధర స్వల్పంగా పెరిగే వీలున్నప్పటికీ, పరిశ్రమ సర్దుబాటు చేసుకుం టుందని భావిస్తున్నామని.. డిమాండ్ పై ఎటువంటి ప్రభావం ఉండదని పేర్కొన్నారు. ఇప్పటికే దేశంలో పసిడి మార్కెట్ వ్యవస్థీకృతంగా, పారదర్శకంగా మారుతోంది. ఈ ప్రక్రియ జీఎస్ టీ తో మరింత ఊపందుకునే వీలుందని వివరించింది. భారత్ లో మార్కెట్ ను జీఎస్ టీ మరింత స్థిరిక రిస్తుంది..పన్ను చెల్లించకుండా అక్రమ ప్రయోజనం పొందుతున్న చిన్నషాపులకు జీఎస్ టీ అనంతరం కొంత ప్రతికూలత ఏర్పడవచ్చునని వెల్లడించింది. జీఎస్ టీ ద్వారా పసిడి డిమాండ్ ఏమాత్రం తగ్గదని, పైగా గ్రామీణ వినియోగం పెరుగుతుందని ప్రకటనలో వివరించింది.