రాజ్ కోట్ వేదికగా నేడే భారత్- కివీస్ రెండో T-20..

SMTV Desk 2017-11-04 10:30:00  india newzealand 2 nd t-20, rajkot venue, team india captain kohli, siraj

రాజ్ కోట్, నవంబర్ 04 : భారత్ - కివీస్ మధ్య మూడు T-20 సిరీస్ లో భాగంగా రెండో మ్యాచ్ రాజ్ కోట్ వేదికగా జరగనుంది. ఈ మ్యాచ్ గెలిస్తే కోహ్లి సేన సిరీస్ ను ఇంకో మ్యాచ్ మిగిలి ఉండగానే సొంతం చేసుకుంటుంది. మరోవైపు సిరీస్‌ కొనసాగుతున్న కొద్ది బలహీనపడిపోతున్నట్లు కనిపిస్తున్నన్యూజిలాండ్‌, ఈ సిరీస్‌ ను కాపాడుకునే ప్రయత్నంలో పోరుకు సిద్ధమైంది. బ్యాటింగ్ పరంగా భారత్ జట్టు దుర్భేధ్యమైన ఫామ్ లో ఉంది. ఓపెనర్లు రోహిత్‌, ధావన్‌, విరాట్‌ కోహ్లి, ఇటు బౌలింగ్‌లో భువనేశ్వర్‌, బుమ్రా, చాహల్‌ జోరు మీదుండడంతో జట్టు చాలా బలంగా ఉంది. అయితే కివీస్‌ బ్యాట్స్‌మెన్లలో టామ్‌ లేథమ్‌ ఒక్కడే భారత బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటున్నాడు. బౌలింగ్, ఫీల్డింగ్ లో ఆ జట్టు ఆటగాళ్ళు విఫలమవుతున్నారు. సిరీస్‌పై ఆశలు సజీవంగా ఉంచుకోవాలంటే కివీస్ జట్టు ఈ మ్యాచ్ ను తప్పక గెలవాలి. టీమిండియా జట్టులో ఆశిష్ నెహ్రా వీడ్కోలు చెప్పడంతో హైదరాబాదీ యువతేజం సిరాజ్ ను ఎంపిక చేసే ఆవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.