అధర్మంగా పని చేసే అధికారులకు అండమాన్ దీవులు

SMTV Desk 2017-06-09 15:05:50  YSRCP,Pleenary meeting, MLA Chevireddy bhasker reddy

చిత్తూర్, జూన్ 9 : పార్టీ ప్లీనరీ సమావేశంలో పాల్గొన్న వైకాపా ఎమ్మెల్యే ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులను ఉద్దేశించి పలువిధాలుగా విమర్శించారు. తమ పార్టీ త్వరలోనే అధికారంలోకి వస్తుందని, అప్పుడు అధర్మంగా పని చేస్తున్న అధికారులకు చర్యలు తప్పవని వైకాపా ఎమెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్నారు. ధర్మబద్ధంగా వ్యహరించని అధికారులు ఎవరైనా ఉంటే వారి పేర్లను గుర్తించుకుని, వారిని అండమాన్ దీవులకు పంపుతామని ఎమ్మెల్యే హెచ్చరించారు. మరోవైపు ఉద్యోగ సంఘాల నేతలు ఎమ్మెల్యే మాటలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అవి ఉద్యోగులను భయబ్రాంతులకు గురిచేసే విధంగా ఉన్నాయని, అనుచిత వ్యాఖ్యలు చేయడం భాస్కర్ రెడ్డికు తగదని ఉద్యోగ సంఘాల ఐక్య కార్యాచరణ సమితి అధ్యక్షులు వెంకటేశ్వర్లు అన్నారు. ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే వారి ఆదేశాలే తప్పనిసరిగా పాటిస్తామని, అండమాన్ లాంటి పదాలు వాడడానికి మనది బ్రిటిష్ రాజ్యం కాదని ఉద్యోగసంఘాలు అంటున్నారు.