బంగారు ఆభరణాలపై నాణ్యత ముద్ర

SMTV Desk 2017-11-03 17:16:59  Quality impression on gold jewelry, Union Minister Ramvilas Paswan, delhi

న్యూఢిల్లీ, నవంబర్ 03 : బంగారు ఆభరణాలపై నాణ్యత ముద్ర(హాల్‌మార్క్‌)ను తప్పనిసరి చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికలు చేపడుతోందని కేంద్ర మంత్రి రామ్‌విలాస్‌ పాసవాన్ అన్నారు. ప్రస్తుతం బంగారు ఆభరణాలు కొంటున్న ప్రజలు వాటి నాణ్యత గుర్తించలేకపోతున్నారు. అందుకే విక్రయదారులు బంగారు ఆభరణాలపై హాల్‌ మార్క్‌ను తప్పనిసరిగా ముద్రించేలా చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. వచ్చే ఏడాది జనవరి నుంచి దీన్ని అమలు చేయాలని ప్రభుత్వం యోచిస్తుందన్నారు. ప్రసుత్తం కొన్ని ఆభరణాలపై బీఐఎస్‌(బ్యూరో ఆఫ్‌ ఇండియన్‌ స్టాండర్స్‌)మార్క్‌ వేస్తున్నారని, అయితే దీని వల్ల కూడా వినియోగదారులు నాణ్యతను పూర్తిగా గుర్తించలేకపోతున్నారని కేంద్రమంత్రి పాసవాన్‌ పేర్కొన్నారు. కొనుగోలు చేసే ప్రతి బంగారు ఆభరణాల నాణ్యతను ప్రజలు తెలుసుకోవాలని ఈ నిబంధనను ప్రవేశ పెట్టనున్నారు.