యాక్సిడెంట్ అని నమ్మించి...ఆ పై లైంగిక దాడి

SMTV Desk 2017-06-09 14:44:18  crime, rep,

ఫిలింనగర్, జూన్ 09 : ఓ యువతిని నమ్మించి అత్యాచారం చేసిన ఘటన ఫిలింనగర్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే వెంకటరమణకాలనీలో నివసించే యువతి (23) ఫిలిం నగర్ లోని ఒక బ్యూటి పార్లర్ లో పని చేస్తుంది. సంవత్సరం క్రితం ఈ యువతి యాంకరింగ్ లో కోచింగ్ తీసుకోవడానికి రోజు వెళ్ళేది. ఆ సమయంలో శ్రీనగర్ కాలనీకి చెందిన జి. శ్రీనివాసరావు తో పరిచయం ఏర్పడింది. ఆతను ప్రేమిస్తున్నాను అని చెప్పి ఆమె వెంట పడేవాడు. అయిన ఆమె పట్టించుకోలేదు. ఒక కట్టుకథ అల్లి ఫోన్ చేసి నాకు ఒక రోడ్డు ప్రమాదం జరిగింది. నువ్వు నన్ను చూడటానికి రావాలని చెప్పాడు. వెంటనే ఆ యువతి తను చెప్పిన మాటలు నమ్మి శ్రీనగర్ కాలనీలోని శ్రీనివాసరావు ఉంటున్న రూమ్ కు వెళ్ళింది. అప్పుడు జ్యూస్ లో మత్తు మందు కలిపి తాగించాడు. తరువాత ఆ యువతి పై అత్యాచారం చేశాడు. దీంతో ఆమె గర్బవతిని అయ్యానేమో అని అతన్ని అడిగింది. పెళ్లి చేసుకుంటానని చెప్పి నమ్మించి తప్పించుకు తిరుగుతున్నడు. దీంతో ఆమె బంజారాహిల్స్ లోని పోలీసుస్టేషన్ లో ఆ యువతి గురువారం శ్రీనివాస్ పై పిర్యాదు చేసింది. ఈ మేరకు ఎస్సై వినోద్ కుమార్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేసున్నారు.