ఈ ఏడాది ఎస్సీ రుణ లక్ష్యం 62,978 : పిడమర్తి రవి

SMTV Desk 2017-11-03 14:43:20  SC loan target is 62,978 members, SC Corporation Chairman, Pidarumathi Ravi

హైదరాబాద్, నవంబర్ 03 : తెలంగాణ రాష్ట్రంలో దళితుల నుండి పేదరికాన్ని ప్రాలదోలదానికి తెరాస ప్రభుత్వం నిబద్ధతతో పనిచేస్తుందని ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి పేర్కొన్నారు. ఎస్సీ ఆర్ధిక సహకార సంస్థ ద్వారా స్వయం ఉపాధి రుణాలకు లబ్దిదారుల ఎంపిక ప్రక్రియ కొనసాగుతుందని, ఈ ఆర్ధిక సంవత్సరంలో 62,978 మందికి రుణ మంజూరు లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన వివరించారు. కాగా ప్రభుత్వం 60-80 శాతం సబ్సిడీ ఇస్తున్నా బ్యాంక్ లు మాత్రం లబ్దిదారులను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. బ్యాంకు లింకేజ్ లేకుండా ప్రభుత్వమే నేరుగా రుణ మంజూరు చేయాలని లబ్ధిదారులు వేడుకుంటున్నారు. ఈ ఏడాది ఎస్సీలకు మూడెకరాల భూమి పథకం కింద 5వేల ఎకరాలు లక్ష్యం కాగా, ఇప్పటికి 1,930 ఎకరాలను 776 మందికి పంపిణీ చేసినట్లు పిడమర్తి రవి పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఎస్సీ కమిషనర్ కరుణాకర్, సంస్థ వైస్ చైర్మన్ లచ్చిరాం పాల్గొన్నారు.