కేంద్రం మరో కీలక ప్రకటన..

SMTV Desk 2017-11-03 13:09:57  Central government, SUPREME COURT, OLD NOTES

న్యూఢిల్లీ, నవంబర్ 3 : రద్దయిన నోట్లు ఎవరైనా కలిగి ఉంటే భారీ జరిమానాలు తప్పవని కేంద్రం హెచ్చరించిన సంగతి తెలిసిందే. దీనిపై కేంద్రప్రభుత్వం తాజాగా మరో కీలక ప్రకటన వెల్లడించింది. పాత కరెన్సీ రూ. 500, రూ. 1000 నోట్లను కలిగి ఉన్న వారిపై ఎలాంటి క్రిమినల్ చర్యలు తీసుకోబోమని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి తెలిపింది. ఇంకా పాత నోట్లను బ్యాంకులలో డిపాజిట్ చేయని వారిపై సుప్రీంకోర్టు నిర్ణయాన్ని కోరుతూ సుధా మిశ్రా అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్ మేరకు విచారించి ఈ తీర్పును ప్రకటించింది. సుప్రీంకోర్టు దీనిపై తుది నిర్ణయం ప్రకటించేంత వరకు కేంద్రప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోమని స్పష్టం చేసింది.