భారత్ తో కలిసేందుకు సిద్ధం : చైనా

SMTV Desk 2017-11-03 13:04:24   India-china, Foreign Minister Chen Geodong, media

బీజింగ్‌, నవంబర్ 03 : భారత్‌లో సత్సంబంధాలకు చైనా కీలక ప్రాధాన్యం ఇస్తుందని ఆ దేశ విదేశాంగ సహాయ మంత్రి చెన్‌ జియోడాంగ్‌ అన్నారు. పాకిస్థాన్‌కు చెందిన జైషే మహ్మద్‌ నాయకుడు, పఠాన్‌కోట్‌ దాడి సూత్రధారి మసూద్‌ అజహార్‌పై అంతర్జాతీయ ఉగ్రవాది ముద్ర పడకుండా చైనా గురువారం మరోసారి అడ్డుకున్న విషయం తెలిసిందే. ఇది జరిగిన మరుసటి రోజే, భారత్‌తో కలిసి పనిచేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని తాజాగా చైనా ప్రకటన చేయడం గమనార్హం. ఈ విషయంపై ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ... మసూద్‌ విషయంలో చైనా ఇలా అడ్డుకట్ట వేయడం ఇది నాలుగవసారి. సభ్య దేశాల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదని చెబుతూ వీటో అధికారంతో దీన్ని తిరస్కరించింది. భద్రతామండలిలోని 15 దేశాల్లో అమెరికా సహా 14దేశాలు మసూద్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించడానికి మద్దతివ్వగా ఒక్క చైనానే అడ్డు చెప్పింది. భారత్‌-చైనా మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసుకునేందుకు మేం భారత్‌తో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామంటూ, పొరుగు దేశాలతో సహకారం విషయంలో గత కొన్నేళ్లుగా చైనా ఇదే వైఖరి పాటిస్తుందని చెప్పుకొచ్చారు.